“ఈ సృష్టి ఆనందం కోసమా దుఃఖం కోసమా?
“ఈ సృష్టి ఆనందం కోసమా దుఃఖం కోసమా?" అని రమణ మహర్షిని ఓ భక్తుడు అడిగాడు. అందుకు రమణులు "సృష్టి మంచిదో, చెడ్డదో కాదు. మనిషి మనసును బట్టి అంతా మారిపోతుంటుంది" అంటూ ఇలా చెప్పారు. "ఈ సృష్టి ఒక మర్రిచెట్టు లాంటిది. పక్షులు దానిపైకి చేరి గూళ్లు కడతాయి. ప్రజలు దాని నీడన సేదతీరతారు. కొందరు మర్రిచెట్టు కొమ్మకు ఉరివేసుకొని ప్రాణాలు వదులుతారు. ఎవరు ఏమి
చేసినా ఆ చెట్టు వాటితో సంబంధం లేనట్లు ఉంటుంది. ఈ సృష్టి కూడా అంతే. మనసే మనిషికి లేనిపోని ఇక్కట్లు తెచ్చిపెడుతుంది. జీవితాన్ని దుఃఖసాగరంలోకి నెట్టేస్తుంది. భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు. మనిషే మాయల్లో చిక్కుకొని మంచికి దూరమవుతాడు. వేదనల్లో మునిగిపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో గురువులు, యోగులు, జ్ఞానుల్ని పంపి భగవంతుడు మనిషిని ఉద్ధరించాలని చూస్తాడు" అని వివరించారు
No comments:
Post a Comment